AP: ఏలూరులోని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరుగుతున్నాయి. నేడు స్వామివారు భూ వరాహ స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం హనుమద్ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోల ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలు భక్తుల సమక్షంలో వైభవంగా సాగుతున్నాయి.