దారుణం.. కారు డ్రైవర్‌పై దాడి (వీడియో)

AP: విజయవాడలోని భవానీపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద కారును గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి బైక్‌తో ఢీకొట్టాడు. దాంతో అభినవ్ చౌదరిని కారు డ్రైవర్ మనోహర్ నిలదీశారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో మనోహర్‌పై అభినవ్ చౌదరి విచక్షణా రహితంగా దాడి చేశాడు. మనోహర్ మెడపై తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్