విద్యుత్ వినియోగదారులకు బంపరాఫర్

AP: విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. స్వచ్ఛంద అదనపు లోడ్ వెల్లడి పథకాన్ని అమలు చేయగా.. చెల్లించాల్సిన మొత్తంలో రాయితీ ఇస్తుంది. ఈ స్కీమ్‌ను విద్యుత్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దాంతో ఈ ఏడాది చివరి వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు పెరగడం వల్ల డిస్కమ్‌లపై భారం పడుతోంది. దీని వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు వస్తున్నాయి. ఈ సమస్య తగ్గించడానికి ఈ పథకం చాలా ముఖ్యమని అధికారులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్