AP: హైకోర్టు ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. 4 రోజుల క్రితం డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో భాగంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డాన్ బాస్కో స్కూల్ దగ్గర హైకోర్టు ఫైల్స్ తీసుకెళ్తున్న వ్యాన్‌ను కానిస్టేబుళ్లు అడ్డుకోగా.. డ్రైవర్, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలిసి సీఐ అక్కడికి చేరుకోగా.. వివాదం ముదిరింది. తనపై చేయి చేసుకున్నారని వ్యాన్ డ్రైవర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.