పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వ వచ్చాక రూ.234 కోట్ల విలువైన పీడీఎస్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నామని సభలో తెలిపారు. రైస్ స్మగ్లింగ్ చేస్తే పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్నామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.