మాజీ సీఎం జగన్‌తో చిత్రంతో ధ్రువపత్రాలు జారీ!

AP: మచిలీపట్నంలోని తాళ్లపాలెం సచివాలయంలో మాజీ సీఎం జగన్ చిత్రంతో ఉన్న ధ్రువపత్రాలు జారీ చేసినందుకు ఒక మహిళా పోలీసును, డిజిటల్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ సెలవులో ఉన్నందున, మహిళా పోలీసు పడమట పెద్దింట్లమ్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఆమె ఆదాయ ధ్రువపత్రం జారీ చేసేటప్పుడు పాత ఫార్మాట్‌ను ఉపయోగించి, దానిపై జగన్ చిత్రాన్ని ఉంచారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి, విచారణ జరిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్