‘చలో మెడికల్ కాలేజీ’కి అనుమతి లేదు: డీజీపీ

AP: వైసీపీ చేపట్టిన ‘చలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమానికి అనుమతి లేదని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉందని, నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. నిరసన కార్యక్రమాలతో వైద్య విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలిగించొద్దని సూచించారు. వైసీపీ నేతలు పరిమిత సంఖ్యలో వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రం అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్