AP: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొని మాట్లాడారు. "డీఎస్సీ అంటే చంద్రబాబు. ఆయన ఆధ్వర్యంలో 13 డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చి 1,83,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. మొన్నటి డీఎస్సీపై 70 కేసులు పెట్టారు.. అయినా వెనక్కి తగ్గలేదు. న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం’’ అని లోకేశ్ వివరించారు.