బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి: జగన్

AP: రాష్ట్రంలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైసీపీ అధినేత జగన్ ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబుకు పట్టదా? అని ప్రశ్నించారు. ఎరువులు అందిస్తే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందని నిలదీశారు. చంద్రబాబు సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్‌కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్