ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్, బెస్ట్ చీఫ్ మినిస్టర్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు 3వ స్థానంలో నిలిచారు. ఆగస్టు 2024లో 5వ స్థానం, ఫిబ్రవరి 2025లో 4వ స్థానం ఉన్న చంద్రబాబు... తాజా సర్వేలో 3వ స్థానంలో నిలిచారు. మొదటి రెండు స్థానాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ నిలిచారు. సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వటంతో చంద్రబాబుకు మద్దతు పెరుగుతోందని టీడీపీ ట్వీట్ చేసింది.