లక్ష కోట్ల విలువైన భూములపై సర్వే చేయనున్న ఏపీ ప్రభుత్వం

AP: సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారట. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించిన భూముల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే గత 13 ఏళ్లలో దాదాపు లక్ష కోట్ల విలువైన 1,82,270 ఎకరాల భూములను వివిధ అవసరాల కోసం కేటాయించారు. ఈ భూములను కేటాయించినవారు సరిగ్గా వినియోగిస్తున్నారా లేదా నిరుపయోగంగా వదిలేశారా అనే దానిపై ప్రభుత్వం పరిశీలన చేయనుంది. ఈ పరిశీలన అనంతరం, నిరుపయోగంగా ఉన్న భూములను వెనక్కి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్