ఎన్టీఆర్ జిల్లా పేరును ఎన్టీఆర్-విజయవాడ జిల్లాగా, కృష్ణా జిల్లా పేరును పింగళి వెంకయ్య కృష్ణా జిల్లాగా, ప్రకాశం జిల్లా పేరును టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లాగా మార్పు చేయాలని బీజేపీ నేత కేవీ లక్ష్మీపతి రాజా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన, జిల్లాల పేర్ల మార్పు హడావిడిగా చేసిందన్నారు. ప్రజాభిప్రాయాల అనుగుణంగా పేర్లు పెట్టాలని కోరారు.