పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో విషాదం చోటు చేసుకుంది. దాసరి భానుప్రకాష్ అనే యువకుడు ఇన్‌స్టాలో నకిలీ అకౌంట్ క్రియేట్ చేశాడు. తన స్నేహితుడి గోవిందుతో యువతిలా చాటింగ్ చేసి రూ.30 వేలు తీసుకున్నాడు. అయితే అసలు విషయం గోవిందుకు తెలిసింది. దాంతో భానుప్రకాష్‌ను నిలదీశాడు. మనస్తాపానికి గురైన భానుప్రకాష్ పురుగుల మందు తాగాడు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భానుప్రకాష్ ప్రాణాలు విడిచాడు.