పూర్వ విద్యార్థి రాజేంద్రరావు పాఠశాలకు బీరువా వితరణ

విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ పాఠశాలకు పూర్వ విద్యార్థి రాజేంద్రరావు ఒక బీరువాను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకమరాజు మాట్లాడుతూ దాతల సహాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దాత రాజేంద్రరావు విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు, తోటి విద్యార్థులతో స్నేహభావం పెంపొందించుకోవాలని కోరారు. విశ్రాంత ఏంఈవో జయదేవరాజు, ఉపాధ్యాయులు సూరలక్ష్మి, సురేష్, సుజాత, గ్రామస్తులు సురేష్, గజేంద్ర, వినీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్