కూనమరాజుపాళెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనం

నగరి నియోజకవర్గం, నిండ్ర మండలం, కూనమరాజుపాళెం లోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం మహాచండీ అవతారంలో దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు రూపేష్ క్రిష్ణ ఆచార్య భక్తులకు మహాచండీ దేవతను పూజించడం వలన విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని తెలిపారు. అనంతరం రాజ్యమంతటా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ అమ్మవారి మూలమంత్రములతో హవనం, కుంకుమపూజలు, కర్పూర హారతులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్