నగరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద అన్నదాన, ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం, స్వామివారిని పట్టణ వీధుల్లో ఊరేగించి, భక్తుల దర్శనార్థం ఉంచారు. యువకులు డీజేలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ "జై బోలో గణేష్ మహరాజ్ కి జై" అంటూ నినదించారు. చివరగా, స్వామివారిని గంగమ్మ ఒడిలో చేర్చారు.