పుత్తూరుకు చెందిన ఇస్మాయిల్ గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను సంప్రదించారు. ఎమ్మెల్యే స్పందించి, ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాయడంతో, 24 గంటల్లోనే రూ. 4.5 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు బాధితుని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.