తిరుమండ్యం-అప్పలాయగుంట గ్రామ ప్రజలు తమ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని శనివారం తెలిపారు. కూటమి ప్రభుత్వం రూ. 1.31 కోట్లతో మంజూరు చేసిన తారురోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్‌లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.