నగరి: గురుపూజోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం తిరుపతిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజంలో గురువులకు గొప్ప స్థానం ఉందని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులను సన్మానించడం తనకు సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్