విశాఖపట్నం సీతమ్మధారలో ఆదివారం సాయంత్రం ఓ మూగ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆమె మాట్లాడుతూ, మూగ బాలికను రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ఆమె ప్రశ్నించారు.