నగరి: ఎమ్మెల్యే చొరవతో తీరిన నీటి సమస్య

నగరి నియోజకవర్గం, విజయపురంలోని ఎస్సీ హౌసింగ్ కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో తీరిందని స్థానిక ప్రజలు ఆదివారం తెలిపారు. తమ కాలనీలో నీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన నిధులు మంజూరు చేయించి పరిష్కరించారని వారు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి స్పందించిన ఎమ్మెల్యేకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్