పుత్తూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరై, ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. నేటి విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.