పుంగనూరు: బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలో ఏనుగుల దాడుల వల్ల పంట నష్టపోయిన రైతులకు శనివారం అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో సోమల మండల ఏఎంసీ చైర్మన్ కరణం శ్రీనివాసులు నాయుడు ప్రభుత్వం పంపిణీ చేసిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్