చంద్రగిరి: పనపాకంలో కోటి సంతకాల ఉద్యమానికి ఉత్సాహభరిత స్పందన

చంద్రగిరి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి బుధవారం చంద్రగిరి మండలం పనపాకం పేట దళితవాడలో జరిగిన జగనన్న కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను, ఆసుపత్రులను 66ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ప్రజల ఆరోగ్య హక్కులకు విరుద్ధమని ఆయన విమర్శించారు. ప్రజల వైద్యం హక్కు కాపాడేందుకు జగనన్న పిలుపు మేరకు కోటి సంతకాల ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. స్థానికులు పెద్ద ఎత్తున సంతకాలు చేసి మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్