తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామివారు సోమవారం రాత్రి బంగారు తిరుచ్చిపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రం ఉత్తరాభాద్ర సందర్భంగా వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి, వివిధ సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు అభయమిచ్చారు.