చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష

పదేళ్ల క్రితం జరిగిన చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్య కేసులో మేయర్ భర్త మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ (ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ (ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి (ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు (ఏ4), మునిరత్నం వెంకటేష్ (ఏ5)లు దోషులుగా తేలారు. తొలుత 23 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో, ఒకరిని తప్పించి, ఒకరు మృతి చెందడంతో 21 మంది మిగిలారు. తాజాగా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్