జీడి నెల్లూరులో నో స్టాక్

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇంధన కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జీడీనెల్లూరు మండలంలోని చాలా పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయని స్థానికులు తెలిపారు. గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉన్నా పెట్రోల్, డీజిల్ దొరకడం లేదని వాహనదారులు వాపోయారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్