జీడి నెల్లూరు: నీవు నదిలో పడి యువకుడు మృతి

గంగాధర నెల్లూరు పరిధిలో నీవా నదిలో పడి సాయి కుమార్ (25) అనే యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న సాయి కుమార్ నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం గారంపల్లె సమీపంలోని నీవా నదిలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, అది సాయి కుమార్ దేనని గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్