జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఇద్దరు వైసీపీ నాయకులను పార్టీ అధిష్టానం శుక్రవారం సస్పెండ్ చేసింది. నియోజకవర్గంలోని పాలసముద్రం మండలానికి చెందిన శివ ప్రకాష్ రాజు, వెదురు కుప్పానికి చెందిన ధనుంజయ రెడ్డి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. పార్టీ అధిష్టానం విడుదల చేసిన లేఖలో ఈ వివరాలు పేర్కొన్నారు.