ఎస్ఆర్ పురం పోలీసులు బుధవారం సాయంత్రం ఒక దొంగను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆగస్టు 23, 2025న గంగమ్మ గుడి గ్రామంలో కె చిట్టి నాయుడు ఇంట్లో తలుపులు, బీరువాలు పగలగొట్టి బంగారు, వెండి వస్తువులను దొంగిలించిన ఘటనలో జి సురేంద్ర రాజు అనే దొంగను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ. 5 వేల నగదు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.