పుత్తూరు పట్టణంలోని విష్ణు మహల్ థియేటర్ వద్ద బుధవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రానికి సంబంధించిన భారీ కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు 'జై పవన్ కళ్యాణ్' అంటూ నినాదాలు చేశారు. థియేటర్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సినిమా మొదటి నుంచి ఎంతో బాగుందని పవన్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.