నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం పుత్తూరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ప్రజలతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతోనూ చర్చించి, పుత్తూరులోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.