పుత్తూరు మండలం, తడుకు పంచాయతీలోని వి.ఎస్.ఎస్.పురం గ్రామంలో వెంకటేశ్ ఇంట్లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించి ఇల్లు కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సంఘటనా స్థలానికి వెళ్లి, బాధితుడిని పరామర్శించి, తక్షణ సహాయం అందించారు. ప్రభుత్వ హౌసింగ్ స్కీం కింద కొత్త ఇంటిని మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే చర్యలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.