నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలో మంగళవారం సాయంత్రం డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి ఇది ఒక హెచ్చరిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.