పలమనేరు మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చే YSR డ్యాం ఇటీవల కురిసిన వర్షాలకు నిండు కుండలా మారింది. 0.04 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయం పూర్తిగా నిండితే, ఏడాదిన్నర పాటు పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీరు అందుతుంది. డ్యాం నుంచి పంప్ హౌస్ ద్వారా నీటిని ఫిల్టర్ హౌస్కు పంపి, అక్కడి నుంచి ఇంటింటికీ సరఫరా చేస్తారు. ప్రస్తుతం డ్యాంలోని నీరు తమిళనాడుకు కూడా వెళ్తోంది.