చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పలమనేరు చిత్తూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఎర్రచందనం దుంగలతో వస్తున్న కారు, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో వెంకటస్వామి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు రోడ్డు పక్కన లోయలో పడటంతో స్మగ్లర్లు పరారయ్యారు. పోలీసులు కారు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.