పలమనేరులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పగటిపూట ఎండగా ఉన్నప్పటికీ, రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఆకస్మిక వర్షం పట్టణాన్ని జలమయం చేసింది.