తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మహిళా సంఘాలను ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో హోమ్ స్టే బెడ్ అండ్ బ్రేక్ పాస్ట్ ల నిర్వహణపై ఔత్సాహిక మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మెప్మా పిడిలు పాల్గొన్నారు.