ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా, టోటల్ హెల్త్ మరియు డీబీఎస్‌ఐ (డెటాల్ బనేగా స్వస్థ్ ఇండియా) సంస్థలు సంయుక్తంగా “స్వచ్ఛ చిత్తూరు–హెల్తీ చిత్తూరు” కార్యక్రమాన్ని నిర్వహించాయి. చిత్తూరు జిల్లాలోని 121 పాఠశాలల విద్యార్థులు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు, పోస్టర్ పోటీలు, శుభ్రత డ్రైవ్‌లలో పాల్గొన్నారు. తవణంపల్లి టోటల్ హెల్త్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. కలికిరి మురళీ మోహన్, వెంకటేశ్ చౌదరి, ఎంఈఓ హేమలత, నాగేశ్వరరావు, మనీ నాయుడు, రంజిత్ రెడ్డి, గాలి దిలీప్, గోపి యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.