చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామివారిని నటుడు నారా రోహిత్, ఆయన సతీమణి ఆదివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మురళీ మోహన్ వారికి స్వాగతం పలికి, దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు నూతన వధూవరులకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఆలయ వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు.