పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం, కోటపల్లి సమీపంలో ఆదివారం ఉదయం 16 ఏనుగుల గుంపు పంటపొలాల్లోకి ప్రవేశించింది. నరసింహులు అనే రైతుకు చెందిన 60 మామిడి చెట్లతో పాటు వెంకట్రామయ్య, రఘు, మురళికి చెందిన మామిడి చెట్లను కూడా ఏనుగులు ధ్వంసం చేశాయి. బాధితులైన రైతులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, అధికారులు తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు.