పుంగనూరు బజారువీధిలో సోమవారం సాయంత్రం అన్నదమ్ములిద్దరు అర్ధగంట వ్యవధిలో మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. జనరల్‌స్టోర్ నిర్వహిస్తున్న అన్న పురుషోత్తంశెట్టి (75) తన తమ్ముడు రాధాకృష్ణయ్యశెట్టి (67) బాత్‌రూమ్‌లో జారిపడటంతో అతన్ని పైకిలేపే ప్రయత్నంలో తలుపుగడిపై పడి తలకు గాయమైంది. రాధాకృష్ణయ్యశెట్టి అప్పటికే మృతిచెందగా, గాయపడిన పురుషోత్తంశెట్టిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఒకే కుటుంబంలో ఒకే రోజు, ఒకే గంటలో ఇద్దరు సోదరులు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.