బుధవారం పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టుల అభివృద్ధికి ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.