పుంగనూరులో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ

పుంగనూరు పట్టణం బజారు వీధిలో శుక్రవారం రాధాకృష్ణ శెట్టి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదును దొంగలు అపహరించుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్