చౌడేపల్లె: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

చౌడేపల్లె మండలం, చింతమాకులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మునుస్వామి (65) శనివారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువు వద్ద వేటకు వెళ్లారు. వల వేస్తుండగా అందులోనే చిక్కుకుని మృతిచెందారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్ద గాలించగా, మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్