పెనుమూరు: 'అమ్మ నాన్నా సారీ.. నేను మిమ్మల్ని విడిచి వెళ్లిపోతున్నా'

ఆదివారం మండలంలోని ఓ గ్రామంలో 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమవ్వడంతో మనోవేదనకు గురైన విద్యార్థి, తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ లేఖ రాసి, ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇటీవల అదే కళాశాలలో చదువుతున్న 18 ఏళ్ల యువతితో కలిసి విజయవాడ వెళ్లిపోయిన విద్యార్థిని, యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు తీసుకువచ్చారు. యువతి తల్లిదండ్రులతో వెళ్లడంతో, విద్యార్థి తీవ్ర దుఃఖంలో మునిగి ఈ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్