పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల, రొంపిచర్ల మండలాలల్లోని పాఠశాలలు, కళాశాలలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్ 2. 0 లో గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.