పుంగనూరు పట్టణంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ముడేయప్ప సర్కిల్ వద్ద శనివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్రాంత డిఎస్పి సుకుమార్ బాబు, సిఐ సుబ్బారాయుడు, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎస్ఐ కెవి రమణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్