నారాయణవనంలో మంగళవారం సాయంత్రం జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక తెప్పోత్సవాలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. నాలుగవ రోజు తెప్పోత్సవాలలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యేకు టిటిడి అధికారులు ఆలయ మర్యాదలు చేశారు. అర్చక స్వాములు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.