శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత ప్రముఖమైన గరుడసేవకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ సేవలు అందించాలని టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం కోరారు. శనివారం సాయంత్రం తిరుమలలోని ఆస్థాన మండపంలో జరిగిన ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో సమన్వయ సమావేశంలో, గ్యాలరీలలో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేశామని, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుని ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలు అందేలా చూడాలని సూచించారు.